సమ్మిళిత విద్య – దివ్యాంగ మరియు ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల భవిత కు భరోసా
సమ్మిళిత విద్య - భవితా కేంద్రాల నివేదిక,
భద్రాద్రి కొత్తగూడెం
·
భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలో 23 మండలాలలో ప్రత్యేక అవసరాలు
గల పిల్లల కొరకు భవిత కేంద్రాలు ఏర్పాటు
చేయబడి ఉన్నాయి.
· ఈ 26 కేంద్రాల్లో మొత్తం 40 మంది ఐ. ఇ. ఆర్. పి.లు పనిచేస్తున్నారు. జిల్లాలో ఐ.ఇ.ఆర్.పి పోస్టులు 06
ఖాళీగా ఉన్నాయి.
· 6 మండలాలలో భవిత కేంద్రాలకు శాశ్వత భవనాలు
ఉన్నాయి. మిగిలిన 20 చోట్ల ప్రభుత్వ పాఠశాల భవనాల్లోనే భవిత
కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి.
·
21 రకాల వైఖల్యాలు గల CwSN
పిల్లలు
జిల్లాలో మొత్తం 1773 మంది ఉన్నారు.
·
వీరిలో
1190 మంది
వివిధ రకాల పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్నారు.
·
భవిత
కేంద్రాలలో 209
మంది పిల్లలు అభ్యసన
సాగిస్తుండగా, బడిబయట 140 మంది పిల్లలు ఉన్నారు.
·
పూర్వ
ప్రాథమిక విద్యా స్థాయిలో 97 మంది పిల్లలు ఉన్నారు.
·
హోం
బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి శనివారం ఐ. ఇ. ఆర్. పి.లు CwSN పిల్లల ఇండ్లకు వెళ్లి, 137 మంది పిల్లలకు ప్రత్యేక బోధన అభ్యసన నిర్వహిస్తున్నారు.
· జిల్లాలో 9 మంది ఫిజియోథెరపిస్ట్ లు, 23 మండల కేంద్రాల్లో ప్రతీ వారం ఫిజియోథెరపీ క్యాంపులను నిర్వహిస్తున్నారు.
·
అన్ని
మండలాలలో ఫిజియోథెరపీ క్యాంపుల ద్వారా 152 మంది CwSN పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయి.
·
జిల్లాలో
మొత్తం 20 భవిత కేంద్రాల్లో కేర్ గివర్స్ (ఆయాలు ) పని చేస్తున్నారు.
· అర్హత గల దివ్యాంగ విద్యార్థులకు రూ.500/- చొప్పున ట్రాన్స్పోర్ట్ అలవెన్సు , రూ.500/-
చొప్పున ఎస్కార్ట్ అలవెన్సు,
నెలకు రూ.60/- రీడర్ అలవెన్సుల తో పాటు, ప్రత్యేకంగా
బాలికలందరికి రూ.200/- చొప్పున స్టైపెండ్ ను
కూడా అందిస్తున్నారు.
· ప్రతీ సంవత్సరం జనవరి మరియు మే నెలలలో CwSN
పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి , గుర్తించిన
పిల్లలను CwSN వెబ్సైట్ లో నమోదు చేస్తున్నారు.
· ఇలా నమోదైన పిల్లలందరికి ప్రభుత్వం అందించే సధుపాయాలన్నీ అందే
విధంగా IERP
లు తోడ్పాటు ను అందిస్తున్నారు.
· ముఖ్యంగా ప్రతీ సంవత్సరం జిల్లా స్థాయిలో CwSN పిల్లలకు ఉపకరణాల అందించేందుకు నిర్ధారణ శిభిరాన్ని ఏర్పాటు చేసి ,అర్హత గల పిల్లలకు ఉపకరణాలు అందజేస్తారు. అదేవిధంగా 2022-23 విద్యా సంవత్సరానికి గాను, ది 25 -11- 2022 న భవితా కేంద్రం, కొత్తగూడెం నందు జరిగిన దివ్యాంగుల నిర్ధారణ శిబిరం నందు మొత్తం 456 మంది పిల్లలు హాజరుకాగా, ALIMCO సంస్థ నుండి వచ్చిన డాక్టర్లు CwSN పిల్లలను పరీక్షించి, అర్హులైన 21 రకాల వైకల్యాలు గల 445 మంది పిల్లలకు ఉపకరణాలను మంజూరు చేసేందుకు అంగీకరించినారు.
·
ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల నుండి 445 మంది పిల్లలకు 691 ఉపకరణాలను ది.14/09/2023 న జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాల, ఆనందఖని (తెలంగాణ
స్కూల్ ) నందు అందజేయనున్నాము.
· ఈ ఉపకరణాల విలువ రూ.35,10030/- ( 35 లక్షల పదివేల ముప్పై రూపాయలు ). దీనిలో సమగ్ర శిక్ష, తెలంగాణ ద్వారా 40% (₹14,04012) మరియు ADIP (Assistance to Disabled
Persons for Purchase/ Fitting of Aids and Appliances) ద్వారా 60% (₹21,06018) మొత్తమును ఖర్చు చేసి, ఈ ఉపకరణాలను దివ్యాంగులైన పిల్లలకు ఉచితంగా అందజేయనైనది.
జిల్లా విద్యాశాఖాధికారి , భద్రాద్రి కొత్తగూడెం.